మాజీ ఎంపీ యలమంచిలి శివాజీని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై అధికారుల కమిటీ వేయడం ద్వారా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం సులభమవుతుందన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల మంత్రులతోనూ కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. కొలిక్కిరాని అంశాలపై సీఎంల చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు. భద్రాచలం ఎగువన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నామని పేర్కొన్నారు.