AP: విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇండిగో, ఎయిరిండియా విమానాలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయానికి స్థలం పరిశీలిస్తున్నాం. రణస్థలం వద్ద 6లైన్ల రహదారికి కేంద్రం రూ.252కోట్లు ఇచ్చింది. ఈ రహదారి పనులను త్వరగా పూర్తి చేస్తాం’ అని తెలిపారు.