AP: కడప జిల్లా బద్వేల్లో ప్రేమోన్మాది పెట్రోల్ దాడి ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతిచెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని ఆదేశించారు. నేరస్థుడికి మరణ శిక్ష పడేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ శిక్ష హెచ్చరికగా ఉండాలన్నారు.