అంతరిక్షం నుంచి భారీ గ్రహశకలం(ఆస్టరాయిడ్ 2020WG) రేపు భూమిపైకి దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని పరిమాణం 70 అంతస్తుల భవనమంత ఉంటుంది. భూమికి 3.3 మిలియన్ కి.మీ దూరంలో సెకన్‌కు 9.43 కి.మీ వేగంతో దూసుకొస్తోంది. ఈ గ్రహశకలం వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెప్పారు. భవిష్యత్తులో గ్రహశకలాల వల్ల ముప్పు తప్పించే మార్గాలపై అధ్యయనానికి దీని రాకను ఉపయోగించుకుంటామని తెలిపారు.