ముంబైలోని బాంద్రా టెర్మినల్ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా సొంతూర్లకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు చేరటంతో రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ పైకి భారీగా ప్రయాణికులు రావటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.