TG: కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకమన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద ఏళ్ల చరిత్రలో నేటికీ అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందని, BRS పార్టీ అధివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. BRS చేసిన అప్పులకు నెలకూ రూ.6 వేల కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు.