AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. తిరుమల లడ్డూ కల్తీపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజులపాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.