శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణస్వీకారం చేశారు. త్రిముఖ పోరులో విజయం సాధించిన ఆయన ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న ఆ దేశాన్ని ఎలా నడిపిస్తాడనేది.. నూతన అధ్యక్షుడికి సవాల్‌గా మారింది.