TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు, నగరవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.