AP: తిరుపతి లడ్డూ ప్రసాదంపై మరో వివాదం రాజుకుంది. ఒకవైపు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన పద్మావతి అనే భక్తురాలు ఇటీవల తిరుపతి దర్శనానికి వెళ్లింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వారికి పంచేందుకు ప్రసాదాన్ని తెరిచి చూడగా అందులో పొగాకు పొట్లం గుర్తించి షాక్కు గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.