పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఆప్ సర్కార్ కేబినెట్లో కొత్తగా ఐదుగురు మంత్రులకు చోటుదక్కింది. వారితో గవర్నర్ గులాబ్ చంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే మొదటిసారి. 30 నెలల భగవంత్ మాన్ సర్కార్లో మంత్రివర్గ విస్తరణ ఇది నాలుగోసారి కావడం గమనార్హం.