ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో బైగామర్ గ్రామానికి చెందిన రాథియా అనే యువకుడు ఇంట్లో నిద్రపోతుండగా ఓ పాము కాటువేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. దీంతో ఆ పామును గ్రామస్తులు పట్టుకున్నారు. రాథియా అంత్యక్రియల్లో ఆ పామును కూడా కర్రకు కట్టి ఈడ్చుకెళ్లారు. అనంతరం యువకుడి చితిపై సజీవంగా ఉన్న పామును వేసి దహనం చేశారు. తమపై కూడా దాడి చేస్తుందేమోనన్న భయాందోళనతో పామును కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.