VZM: దీపావళి పండగ నేపథ్యంలో బాణాసంచా ప్రేలుడు జరగకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి జిల్లా ఎస్పీలను సోమవారం ఆదేశించారు. డిఐజి మాట్లాడుతూ.. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని విశాఖ రేంజ్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. బాణాసంచా నిల్వలు, తయారి దారులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.