AP: 50 ఏళ్లుగా తనతో స్నేహం కొనసాగిస్తున్న ఏడుగురు మిత్రులు 70 ఏళ్లలోకి అడుగుపెడుతున్నందున మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు విశాఖలో వారిని సన్మానించారు. 1972-73లో ఏర్పడిన స్నేహానుబంధం నేటికీ కొనసాగుతున్నందున గుర్తుగా ‘సప్తతి’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో ఏడుగురు మిత్రుల దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి అనుకోని అతిథిగా సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు.