పాకిస్థాన్‌లో 11 దేశాల దౌత్యవేత్తలే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. రాయబారులు మింగోరాలో నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో పాల్గొని మలమ్ జబ్బాకు వెళ్తుండగా వారి కాన్వాయ్‌పై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దౌత్యవేత్తలే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని ధృవీకరించారు.