కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి దోచిపెడుతున్నాయని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కంగనా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని.. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు సోనియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది. కంగనాకు పెద్దగా జ్ఞానం లేదని ఆమె మాటల్లోనే తెలుస్తోందని ఎద్దేవా చేసింది.