AP: తిరుమల లడ్డూ వివాదంపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ పదార్థాలు వాడారని అన్నారు. దేవుడితో కూడా గత ప్రభుత్వం వ్యాపారం చేసిందని మండిపడ్డారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి విషయంలో ఎవరు తప్పుగా వ్యవహరించినా పుట్టగతులు ఉండవు అని ధ్వజమెత్తారు.