AP: రాష్ట్ర బీజేపీ చీఫ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి కీలక పదవి దక్కింది. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్‌గా పురందేశ్వరిని నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా ఆమె వ్యవహరిస్తారని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పదవుల్లో ఆమె రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.