TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి కేటీఆర్ తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. పని భారం మీద ప్రశ్నించినందుకు వారిని సస్పెండ్ చేయడం ఏంటని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని రగిల్చింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. ‘ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ’ అంటూ ట్విటర్ వేదికగా కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.