AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీఎస్ నీరబ్ కుమార్ హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.