తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని స్థాపించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ పార్టీ తొలి బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. విల్లుపురం జిల్లా విక్రవాండీలోని వీసాలై గ్రామంలో తొలి మహానాడు జరగనుంది. ఇందుకోసం పార్టీ నేతలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ ఏ ఏ అంశాల గురించి ప్రస్తావిస్తారనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.