TG: గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో -29 రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీంలో అప్పీల్ చేశారు. సుప్రీం కోర్టులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, నేటి నుంచి ఈ నెల 27 వరకు మెయిన్స్ పరీక్షలు కొనసాగనున్నాయి.