TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ఫీడింగ్ రూమ్, ఎస్బీఐ శాఖతో పాటు భోజనశాల, కలెక్టరేట్ గేట్ వద్ద నిర్మించిన బస్ స్టాప్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. కాగా, కార్యక్రమం ఏర్పాట్లను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శనివారం పరిశీలించారు.