ELR: ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఆదివారం మండల మానవత సమావేశం అడపా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. మానవత రాష్ట్ర విస్తరణ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సాగిరాజు జానకిరామరాజు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలని, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ఇందులో కార్యదర్శి గంజి రవి కుమార్, శీతాల సత్యనారాయణ, బొమ్మిడి అప్పారావు ఉన్నారు.