TG: దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడంపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బందులకు గురయితే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు.