ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి ఏపీ సర్కారు సిద్ధమైంది. ‘రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్’ పేరుతో డిజైన్ల కోసం టెండర్లను పిలిచింది. ఢిల్లీలోని మూడు ప్రదేశాల్లో కలిపి 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ఆర్&బీ శాఖ డిజైన్లను కోరింది. ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లు సంబంధిత వెబ్సైట్లో టెండర్లను నవంబర్ 28లోపు అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది.