TG: ఐదు నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా పరిగణించి రిజర్వాయర్లలోని నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. తాగు నీటి సరఫరాలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలన్నారు. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, ప్రజలు బోర్లు, ఆర్వో ప్లాంట్లను కోరుతున్నారని గుర్తు చేశారు. ఆ విధానం పోయేలా సిబ్బంది పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.