NZB: కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల గిరి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం బోధన్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. నవంబర్ 13న సాయంత్రం 3 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. 14న రాత్రి అరుణాచలం చేరుకుని, మరుసటి రోజు అక్కడి నుంచి బయలుదేరి 16న సాయంత్రం బోధన్‌కు చేరుకుంటుందని తెలిపారు.