సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎమోషనల్ పోస్ట్ చేశారు. పోటీ కొత్తేమో గానీ.. పోరాటం కొత్త కాదని తెలిపారు. వయనాడ్ ప్రజల ధైర్య సాహసాలే నాలో స్ఫూర్తిని నింపాయన్నారు. వయనాడ్ ప్రజల తరపున పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. వయనాడ్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.