ఖమ్మం: రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 28న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. కావున విషయాలు గమనించి.. రైతులంతా పాల్గొని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.