HYD: జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ మేథమేటిక్స్ విభాగంలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు. సదస్సులో భాగంగా విద్యార్ధులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. రెండో రోజు సదస్సు ముగింపుకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రొఫెసర్ గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణితంలో శ్రీనివాస రామానుజన్ అందించిన సేవలను కొనియాడారు.