TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు అశక్తుడినని.. నాలుగు నెలలుగా అవమానాలకు గురవుతున్నానని తెలిపారు. ‘కాంగ్రెస్ నాకు ఇల్లు లాంటిది. 4 దశాబ్దాల బంధం నాది. పార్టీలో జరుగుతున్నా పరిణామాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఫిరాయింపులపై నా ఆలోచన నేను చెప్పా.. నిర్ణయం పార్టీ ఇష్టం. బీఆర్ఎస్ ఎవరో కాంగ్రెస్ ఎవరో అర్థం కావడం లేదు’ అని అన్నారు.