నాన్-బాస్మతి తెల్ల బియ్యం ఎగుమతులపై గతంలో నిర్దేశించిన కనీస ధరను కేంద్రం తొలగించింది. ఈ రకం బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బాస్మతియేతర తెల్లబియ్యం ఎగుమతులపై ఈ ఏడాది సెప్టెంబరు 28న ఆంక్షలు ఎత్తి వేయగా.. అప్పుడు నిర్ణయించిన కనీస ఎగుమతి ధరను ఇప్పుడు తొలగించింది. పారాబాయిల్డ్ బియ్యం, బ్రౌన్ బియ్యం, వడ్ల ఎగుమతులపై సుంకం తొలగింపు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చింది.