ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని చూస్తున్నారని.. చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని పాల్ అన్నారు. తనను చంపాలని అనుకున్న వారే చచ్చి పోయారని ఎద్దేవా చేశారు. అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటానని పాల్ పేర్కొన్నారు. తాను వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు.