TG: ISBలో ఉన్న వారు రాష్ట్రానికి, దేశానికి అంబాసిడర్లు కావాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. HYDను 600 మిలియన్ సిటీగా మార్చేందుకు మీ సహకారం కావాలన్నారు. న్యూయార్క్, లండన్, పారిస్‌తో తెలంగాణను పోల్చాలనుకుంటానని పేర్కొన్నారు. మీరంతా రాష్ట్రంలో 2, 3 ఏళ్లు పనిచేయాలన్నారు. తమ ప్రభుత్వం కార్పొరేట్ తరహాలో జీతాలు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్ అందిస్తుందన్నారు.