TG: హిందూ ఆలయాలపై దాడులు చేసిన వారిపై వెంటనే ఉరి తీయాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్లో దుండగుడు దాడి చేసిన ముత్యాలమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. అంతకుముందు ఆలయంలో శాంతి పూజ నిర్వహించారు. భారత రాజ్యాంగం రామరాజ్యంతో సమానమని తెలిపారు. కానీ, రాజ్యాంగంలోని సారంశం నేడు రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు.