TG: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. ఘటన వివరాలను, సునీతా లక్ష్మారెడ్డి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై కేసులు నమోదు చేసి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతా లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని కాంగ్రెస్ గుర్తించాలన్నారు.