TG: చర్లపల్లి టెర్మినల్ త్వరలో అందుబాటులోకి వస్తుందని, ఇక్కడ 20 రైళ్లు ఆగే సదుపాయం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గూడ్స్ రైళ్లు కూడా ఇక్కడే అన్లోడ్ చేసుకోవచ్చని, 95 నుంచి 98 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈ టెర్మినల్ పూర్తయితే SEC స్టేషన్లో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రోడ్డు పనులు పూర్తిచేయాలని, గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఈ ప్రభుత్వమైనా వేగంగా పూర్తిచేయాలన్నారు.