దానా తీవ్ర తుపాను తీరం దాటింది. ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య అర్థరాత్రి 1:30 నుంచి 3:30 గంటలలో తీరం దాటింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. తీర ప్రాంత జిల్లాలైన భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్, కేంద్రపరాలలో భారీ వర్షం కురిసింది. దానా తీవ్రతుపాను ప్రభావిత జిల్లాలోని చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. ఈ క్రమంలోనే ఒడిశా ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది.