TG: మూసీ ప్రక్షాళనలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ముసాపేట పరిధిలోని బాలాజీనగర్ కాలనీలో తాళం వేసిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. కాలనీలో ఉండే కటిక నిరుపమ రాణి వారి కుటుంబ సభ్యులతో తిరుమల దర్శనానికి వెళ్ళారు. మళ్లీ తిరిగి వచ్చే సరికి అధికారులు ఇంటిని కూల్చివేశారు. అయితే, కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని.. ఇంట్లో సామాగ్రి మొత్తం ధ్వంసం అయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.