చాలామంది కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదం ఆయిల్‌ను కళ్ల కింద నల్లటి వలయాలపై రాసి మెల్లగా మసాజ్ చేయాలి. రాత్రి పడుకునే ముందు రాసి.. ఉదయాన్నే కడిగేయాలి. అలాగే టమాటా ఈ సమస్యను దూరం చేస్తుంది. టమాటా, నిమ్మకాయ రసాలని కలిపి కళ్ల కింద అప్లైచేసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి 2సార్లు ఇలా చేయాలి.