అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రచార జోరు కోనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య మిషెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతివ్వడం నాకు నచ్చట్లేదు. ట్రంప్ అధికారంలోకి వస్తారేమోనని భయంగా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా, సర్వేలన్నీ ట్రంప్‌కే విజయవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించాయి.