జార్ఖండ్లో విద్యావ్యవస్థ విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాంచీలో నిర్వహించిన సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. గిరిజనుల వారసత్వం, చరిత్ర, సంస్కృతి, వైద్యవిధానాలను బీజేపీ నాశనం చేసేందుకు చూస్తోందని విమర్శించారు. కులగణను ప్రధాని మోదీ వ్యతిరేకించారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.