జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ CM ఒమర్ అబ్దుల్లా కేబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదించారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు త్వరలో CM ఢిల్లీ వెళ్లనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, జమ్మూకశ్మీర్ మొదటి శాసనసభా సమావేశం నవంబర్ 4న నిర్వహించనున్నట్లు కేబినెట్ పేర్కొంది.