AP: జపాన్ పర్యటనకు అనుమతించాలని ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్‌పై సీబీఐ కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ హైకోర్టు అవినాష్‌కు సూచించింది. వివేకా హత్యకేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా విదేశీ పర్యటనలపై కోర్టు పలు షరతులు విధించిన విషయం తెలిసిందే. నిబంధనలు సడలించాలని అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 26 నుంచి నవంబర్ 2 వరకు జపాన్ పర్యటనకు అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.