AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ముద్రగడ క్రాంతి జనసేనలో చేరారు. ఆమెకు పవన్ కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. అలాగే, గుంటూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, నలుగురు జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిలర్లు చేరారు. జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని మరింతగా పెంచాయని పవన్ అన్నారు. ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.