AP: YS షర్మిల భర్త బ్రదర్ అనిల్ తన బావ YS జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కు మద్దతుగా పాదయాత్ర చేయాలని భారతీనే షర్మిలను అడిగారని తెలిపారు. ‘యాత్ర సందర్భంగా ఆమె పార్టీని ఎత్తుకుపోతోందని జగన్తో సజ్జల చెప్పారు. జగన్కు అప్పటి నుంచే అభద్రతాభావం మొదలైంది. తెలంగాణలో పార్టీ పెట్టాలని PK అడిగారు. ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయని, KCRతో ఇబ్బంది అవుతుందని జగన్ వద్దన్నారు’ అని అనిల్ చెప్పారు.