2026 కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీని తొలగిస్తారని వార్తలొస్తున్నాయి. కామన్వెల్త్ క్రీడలు ఈ సారి స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో 19 ఈవెంట్లను నిర్వహించారు. అయితే, ఖర్చులను తగ్గించుకోవడం కోసం హాకీ, నెట్ బాల్, రోడ్ రేసింగ్‌తో పాటు మరో 6 ఈవెంట్లను తొలగిస్తారని సమాచారం.