TG: రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన సాగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, గ్యారంటీల పేరుతో గారడీలు చేశారని ఎద్దేవా చేశారు. KCR పాలనలో సరైన సమయంలోనే రైతుబంధు పంపిణీ చేశారని, వర్షాలు వచ్చేలోపు రైతుబంధు ఇవ్వాలని గతంలో KCR చెప్పినట్లు గుర్తుచేశారు. రైతుభరోసా కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ వచ్చాక చేపపిల్లల పంపిణీ, రైతుబంధు వస్తలేదన్నారు.