ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఇంట్లోనే గుమ్మడికాయతో నేచురల్ ఫేస్‌ప్యాక్ వేసుకుంటే అందం మరింత రెట్టింపు అవుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయలో విటమిన్ A, C, E పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా చేస్తాయి. మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు రాకుండా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.